ఈ ఈవీ బ్యాటరీ స్పెషల్
హోండా కంపెనీ EM1- e మోడల్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేఉసింది. ప్రస్తుతం దీన్ని యురోపియన్ మార్కెట్ కోసం ప్రారంభిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలోగా ఈ వెహికల్ మన మార్కెట్లలోకి అందుబాటులోకి రాబోతోంది. 2025 నాటికల్లా భారత, అంతర్జాతీయ మార్కెట్లలోకి 10 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మోడల్స్ తీసుకురావాలని హోండా భావిస్తోంది. స్కూటర్లలో హోండా ద్విచక్ర వాహనం యాక్టివా దేశంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలుస్తున్న విషయం తెలిసిందే. గ్రామీణ, పట్టణాల్లో యువతను టార్గెట్‌గా చేసుకుని ఈ మోడల్‌ను తీసుకొస్తున్నట్టు హోండా పేర్కొంది. నగరాల్లో తక్కువ దూరం ప్రయాణించే వారి కోసమే ఈ EM1 e ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ స్కూటర్ ఫుల్ బ్యాటరీ చార్జ్ పై 40 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుందని…విభిన్న ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ లెవెల్స్, వైబ్రేషన్స్ ఉన్నా ప్రభావం పడకుండా ఈ మొబైల్ పవర్ ప్యాక్ (MPP) బ్యాటరీని తయారు చేసినట్లు హోండా పేర్కొంది. ఇది స్వాపబుల్ బ్యాటరీ. అంటే స్కూటర్ నుంచి ఈ బ్యాటరీని సులువుగా వేరు చేసి ఇంట్లో చార్జ్ చేసుకోవచ్చు.