మార్కెట్లోకి కొత్త ఎస్-ప్రెస్సో
సరికొత్త ఎస్-ప్రెస్సోను మారుతి సుజుకీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇపుడ ఉఎంట్రిలెవల్ హ్యాచ్బ్యాక్ మోడల్స్ మధ్య పోటీ పెరిగింది. ఈ కారు ధర రూ.4.25 లక్షలు నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. వీటిలో మాన్యువల్ రకం అంటే గేర్ మోడల్ ధర రూ.4.25 లక్షల నుంచి రూ.5.49 లక్షల లోపు లభించనుండగా, ఆటోమేటిక్ గేర్ షిప్ట్(ఏజీఎస్) మోడల్ రూ.5.65 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఒక్క లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్… లీటర్కు 25.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపింది. ఈ మోడల్లో రెండు ఎయిర్ బ్యాగ్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.