న్యూ ఏజ్ బాలెనో…
మారుతీ సుజుకీ కొత్త బాలెనో కారును భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. న్యూ ఏజ్ బాలెనో అని పిలుస్తున్న ఈ కారు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్. బాలెనో మోడల్స్‌లో అత్యున్నతమైన ఇన్-కార్ టెక్నాలజీ, ఎక్స్ప్రెసిివ్ ఫీచర్లతో దీన్ని తయారు చేసినట్లు కంపెనీ అంటోంది. మారుతీ సుజుకీ 2022 బాలెనో ఐదు రంగులతో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ హిల్ కంట్రోల్ ఉన్నాయి. ఇది 6,000 ఆర్పీఎం వద్ద… 90 హెచ్‌బీ పవర్, 4,400 ఆర్పీఎం వద్ద 113 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. న్యూ ఏజ్ లీటర్‌కు మ్యానువల్‌లో 22.35 కి.మీ, ఆటోమెటిక్ వెర్షన్లో.. 22.94 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కొత్త బాలెనో కారు ధర సుమారు రూ.6.35 లక్ష నుంచి రూ.9.49 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) వరకు ఉంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.