రిలయన్స్ కంపెనీ… కొనేవారు లేరు
నిన్న చాలా మంది విశ్లేషకులు ఇవాళ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన టీవీ18, నెట్వర్క్ 18 షేర్‌ను రెకమెండ్ చేశారు. రాత్రి జేమ్స్ మర్డోక్‌తో డీల్ కుదిరాక.. ఇవాళ ఓపెనింగ్‌లోనే అప్పర్ సర్క్యూట్ తాకుతుందని భావించారు. టీవీ18 ప్రి మార్కెట్ డీల్స్‌లో రూ.90 అమ్మకం ధర కాగా, రూ.60 కొనుగోలు ధర. అలాంటి పరిస్థితే నెట్వర్క్ 18 కౌంటర్లో. మార్కెట్ ప్రారంభం నుంచి ఈ రెండు కౌంటర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి. బై ఆన్ రూమర్స్, సెల్ ఆన్ న్యూస్ లెక్కన ఈ షేర్లను అమ్ముతున్నారని సీఎన్‌బీసీ టీవీ18 యాంకర్ అన్నారు. అలాగే ఈ డీల్‌కు సంబంధించి పూర్తి క్లారిటీ లేనందున ఇన్వెస్టర్లు కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పారు. మొత్తానికి టీవీ18 బ్రాడ్కాస్ట్ షేర్ 17 శాతం నష్టంతో క్లోజ్ కాగా, దాని మాతృ సంస్థ నెట్వర్క్ 18 ఏకంగా 20 శాతం అంటే లోయర్ సర్క్యూట్ వద్ద ముగిసింది. అంటే ఆ ధర వద్ద కొనుగోలుదారులు లేరన్నమాట. ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారని కొందరు, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మారని మరి కొందరు అంటున్నారు. లేదా ఈ షేర్లను పడగొట్టి ప్రమోటర్లే దిగువ స్థాయిలో కొంటారా అన్న చర్చ కూడా మార్కెట్లో జరుగుతోంది. మొత్తాన్ని నిఫ్టి పరుగులు తీసిన ఈరోజు… ఈ రెండు షేర్లు దారుణంగా పడటంతో.. అదానీ ఇన్వెస్టర్లు సంబరాలు చేసుకుంటున్నారు.