For Money

Business News

నెస్లే నికరలాభంలో 8 శాతం వృద్ధి

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఇండియా రూ . 668.34 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ .617.37 కోట్లతో పోలిస్తే నికర లాభం 8.25 శాతం ఎక్కువ. నికర అమ్మకాలు కూడా రూ. 3,882.57 కోట్ల నుంచి 18.24 శాతం పెరిగి రూ.4.591 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్‌లో అమ్మకాల విలువ రూ. .3,687.37 కోట్ల నుంచి 18.27 శాతం పెరిగి రూ .4,361.15 కోట్లకు చేరాయి. ఎగుమతులు 15.68 శాతం పెరిగి రూ .205.45 కోట్లకు చేరాయి. షేరుకు రూ.120 చొప్పున రెండో మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది కంపెనీ.