కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు NCLT షాక్
మనీ లాండరింగ్‌తో పాలు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్ (NCLT) హైదరాబాద్ బెంచ్ షాక్ ఇచ్చింది. తన అనుమతి లేకుండా కంపెనీ లేదా అనుబంధ కంపెనీల ఆస్తులను విక్రయించరాదంటూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీలో మైనారిటీ షేర్ హోల్డర్ అయిన మేకా రజనీ వేసిన పిటీషన్‌ను విచారించిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. కంపెనీలోఉన్న మెజారిటీ వాటాను ఉపయోగించి అనుబంధ కంపెనీల ఆస్తులను విక్రయించవద్దని పేర్కొంది. బెంచ్ జ్యుడిషియల్ మెంబర్ భాస్కర పంతుల మోహన్, టెక్నికల్ మెంబర్ బినోద్ కుమార్ సిన్హాలు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే తమ అనుమతి లేకుండా ఇన్వెస్టర్లకు కాని లేదా ఇతర చట్టబద్ధ సంస్థలకు కాని ఎలాంటి చెల్లింపులు చేయొద్దని ఆశించింది. ఇన్వెస్టర్ల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి వేల కోట్లు తీసుకున్నారనే ఆరోపణలను కార్వీ ఎదుర్కొంటోంది. అలాగే వేల కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ చేశారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తోపాట సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టింగేషన్ ఆఫీస్ (SFIO) సెబీ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.