ఎన్సీసీకి భారీ కాంట్రాక్ట్?
హైదరాబాద్‌కు చెందిన నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ(ఎన్సీసీ) కంపెనీకి బెంగళూరు ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ కాంట్రాక్టులో ఎల్1గా వచ్చింది. బిడ్డంగ్లో అత్యంత తక్కువ విలువ ఈ కంపెనీనే బిడ్ చేసింది. ‘నమ్మ మెట్రో’గా వ్యవహరించే 37 కి.మీ. కేఆర్ పురం-కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కారిడార్(లైట్ బ్లూ లైన్)ను నిర్మించడానికి వచ్చిన బిడ్లలో అతి తక్కువ బిడ్డరుగా ఎన్సీసీ నిలిచినట్లు తెలుస్తోంది. మూడు ప్యాకేజీల్లోనూ అతి తక్కువ మొత్తానికి ఎన్సీసీ బిడ్ వేసినట్లు వారు తెలిపారు. ఇది మొత్తం మూడు ప్యాకేజీల కాంట్రాక్ట్. కస్తూరీ నగర్- బైప్పనహల్లి లైన్‌కు రూ. 739 కోట్లు, బెట్టహలసూరు-దొడ్డరాజా సెక్షన్ లైన్‌కు రూ. 680 కోట్లు, హెబ్బాల్-బాగలూరు క్రాస్ లైన్‌కు రూ. 747 కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం కాంట్రాక్ట్ ఎన్సీసీకి దక్కే అవకశాలు అధికంగా ఉన్నాయి.