For Money

Business News

కుటుంబాల రుణాలు రూ.75 లక్షల కోట్లు

2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కుటుంబ అప్పులు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 34 శాతానికి తగ్గాయని ఎస్‌బీఐ పరిశోధనా నివేదిక ఎకోరాప్‌ పేర్కొంది. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావంతో గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కుటుంబాల అప్పు జీడీపీలో 37.3 శాతానికి పెరిగిన విషయం తెలిసిందే. కోవిడ్‌కు ముందు అంటే 2019-20లో ఈ రుణాలు 32.5 శాతంగా ఉందని ఎకోరాప్‌ తెలిపింది. కుటుంబాల అప్పు 2020-21 జూన్‌ త్రైమాసికంలో రూ.73.59 లక్షల కోట్లు కాగా, 2021-22 జూన్‌ త్రైమాసికంలో రూ.75 లక్షల కోట్లుగా ఉండొచ్చని పేర్కొంది.