ఎన్సీసీ నుంచి మెరుగైన ఫలితాలు
డిసెంబరు త్రైమాసికంలో ఎన్సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.3032.84 కోట్ల ఆదాయంపై రూ రూ. 84.20 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదే కాలంలో ఆర్జించిన ఆదాయం రూ.2150.69 కోట్లు, నికర లాభం రూ.77.88 కోట్లు. ఇక ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల్లో కంపెనీ ఆదాయం రూ .7716.92 కోట్లు కాగా, నికర లాభం రూ .260.18 కోట్లు. అనుబంధ సంస్థలైన రైల్ ప్రైవేట్ లిమిటెడ్, వైదేహి అవెన్యూస్ కంపెనీలు తమ కంపెనీలో విలీనం అయ్యాయని, 2020 ఏప్రిల్1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని ఎన్సీసీ పేర్కొంది.