నజారా చేతికి హైదరాబాదీ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన ఓపెన్‌ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. శ్రీరామ్ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ నుంచి ఓపెన్‌ప్లేను కొనుగోలు చేసినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలిపింది. 2021-22 సెప్టెంబరు కల్లా ఓపెన్‌ప్లేలో 23.30 శాతం వాటాను రూ.43.43 కోట్లతో కొనుగోలు చేస్తారు. మిగతా పెట్టుబడి దశలవారీగా 2021-22లోనే పూర్తి చేస్తామని వివరించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఓపెన్‌ప్లే రూ.53.48 కోట్ల టర్నోవర్ సాధించింది.