For Money

Business News

నాట్కో లాభంలో 38శాతం క్షీణత

జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికానికి నాట్కో ఫార్మా రూ.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.122 కోట్లతో పోలిస్తే నికర లాభం 38 శాతానికి పైగా క్షీణించింది. ఆదాయం కూడా రూ.582 కోట్ల నుంచి రూ.427.30 కోట్లకు తగ్గింది. జూన్‌ తో ముగిసిన మూడు నెలల్లో నాట్కో ఫార్మా రూ.61.6 కోట్ల ఏపీఐలు, రూ.145.4 కోట్ల ఫార్ములేషన్లను ఎగుమతి చేసింది. దేశీయంగా రూ.200 కోట్ల విలువైన ఔషధాలను విక్రయించింది. 2021-22 ఏడాదికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2 (100శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.