For Money

Business News

దుమ్ము రేపిన నాస్‌డాక్‌

అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోతున్నాయి. అమెరికా ఉత్పత్తులపై చైనా పది శాతం, చైనా ఉత్పత్తులపై అమెరికా ఇక నుంచి 30 శాతం సుంకం విధించనుంది. ఈ సుంకాలకు సంబంధించి పూర్తి స్థాయి విధివిధానాలను తయారు చేసే పనిలో రెండు దేశాలు ఉన్నాయి. వీటి మధ్య ప్రాథమిక డీల్‌ కుదరడంతో వాల్‌స్ట్రీట్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది. ఈ డీల్‌ కారణంగా డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 101 దాటింది. దీంతో నాస్‌డాక్‌ ఏకంగా 3.7 శాతం లాభంతో ట్రేడవుతోంది. డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు కూడా రెండు శాతంపైగా లాభంతో ఉన్నాయి. డాలర్‌ పెరిగినా… క్రూడ్‌ ధరలు పెరగడం విశేషం.