కుప్పకూలిన వాల్‌స్ట్రీట్
ఉదయం ఆసియా, రాత్రి యూరప్ నష్టాలతో ముగిశాయి. ఉదయం హాంగ్‌సెంగ్, జపాన్ భారీ నష్టాలతో ముగిస్తే… యూరోస్టాక్స్ 500 సూచీ దాదాపు ఒక శాతం నష్టంతో ముగిసింది. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఫ్యూచర్స్ ఏమాత్రం పసిగట్టలేని స్థాయిలో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. భారీ నష్టాల తరవాత కోలుకున్నట్లే కన్పించిన నాస్డాక్ ఏకంగా 2.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. బాండ్ ఈల్డ్స్ పెరుగుతూనే ఉండటంతో చాలా మంది ఇన్వెస్టర్లు షేర్ మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారు. షేర్లు సమయంలో భారీగా పెరిగిన షేర్లను తొలుత అమ్ముతున్నారు. అన్ని రంగాల కన్నా ఐటీ రంగ సూచీలు భారీగా పెరిగినందున..వాటిలోనే ఇపుడు అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఇక డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు కూడా ఒకటిన్నర శాతం నష్టంతో ఉన్నాయి. క్రూడ్ ధరలు భారీగా పెరగడంతో ఎనర్జి షేర్లు లాభాల్లో ఉన్నాయి. దీంతో డౌజోన్స్ 1.3 శాతం నష్టంతో ట్రేడవుతోంది.