For Money

Business News

… మళ్ళీ భారీ నష్టాలు

ఈక్విటీ మార్కెట్లలో లాభాలు మూణ్నాళ్ళ ముచ్చటగా మారింది. యూరప్‌ ద్రవ్యోల్బణ రేట్లు కొత్త రికార్డులు సృష్టించడంతో ఈక్విటీ మర్కెట్లలో ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని సూచీలు ఒకటి నుంచి ఒకటిన్నర శాతం నష్టంలో ఉన్నాయి. అమెరికా మార్కెట్లు ఓపెనింగ్‌ నుంచే పడటం ప్రారంభమైంది. ముఖ్యంగా టెక్నాలజీ షేర్లతో పాటు రీటైల్‌ షేర్లలోకూడా అమ్మకాలు జోరుగా ఉన్నాయి. నిన్న వాల్‌మార్ట్‌ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించగా.. ఇవాళ టార్గెట్‌ కంపెనీ అమ్మకాలకు బలైంది. ఈ కంపెనీ షేర్‌ 25 శాతంపైగా నష్టపోయింది. 1987 తరవాత కంపెనీ షేర్‌ ఈ స్థాయిలో పడటం ఇదే మొదటిసారి. అన్ని ఐటీ, టెక్‌ కంపెనీల షేర్లు మూడు నుంచి ఆరు శాతం వరకు నష్టపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 16.8 శాతం క్షీణించగా, నాస్‌డాక్‌ 26 శాతం తగ్గింది. స్వల్ప మాంద్యం ఛాయలు అమెరికాలో కన్పిస్తున్నాయని వెల్స్‌ ఫార్గో ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఎలాగైనా సరే ద్రవ్యోల్బణాన్ని కట్టడ చేస్తామని ఫెడ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అన్నారు. ఆయన ధోరణి చూస్తుంటే జూన్‌, జులైలో నెలల్లో ఫెడ్‌ అరశాతం మేర వడ్డీ రేట్లను పెంచేలా ఉంది. ఇవాళ బాండ్‌ ఈల్డ్స్‌ స్వల్పంగా తగ్గాయి. డాలర్‌ స్వల్పంగా పెరిగింది. క్రూడ్‌ రెండు శాతం క్షీణించగా, బులియన్‌ స్వల్ప నష్టాలతో ఉంది. ఔన్స్‌ బంగారం ధర 1818 డాలర్ల వద్ద ఉంటోంది.