రేపు రికార్డు లాభాలు?

నిఫ్టి రేపు భారీ లాభాలతో ప్రారంభం కానుంది. గిఫ్ట్ నిఫ్టి ఇప్పటికే 148 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అమెరికాలో సీపీఐ డేటా చాలా పాజిటివ్‌గా రావడంతో వాల్‌స్ట్రీట్ బారీ లాభాల్లో ఉంది. సీపీఐ గణాంకాలు చాలా సాఫ్ట్‌గా ఉండటంతో… మున్ముందు వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. దీంతో నాస్డాక్ ఏకంగా రెండు శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే ఎస్ అండ్ పీ, డౌజోన్స్ సూచీలు దాదాపు 1.25 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. బాండ్ ఈల్డ్స్ సుమారు రెండు శాతం తగ్గాయి. ఇవాళ మన మార్కెట్లు స్వల్ప లాభాలకే పరిమితమైంది. నిన్న అనేక షేర్లలో షార్ట్ కవరింగ్ వచ్చినా… ఇవాళ అలాంటి స్థితి లేదు. అయితే రేపు వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున… షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ ఉంది. మరి నిఫ్టి రేపు 23400ని తాకుతుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ 23400 వద్దే అధికంగా ఉంది.