టెక్ షేర్లలో ఇంకా పతనం
వాల్‌స్ట్రీట్‌ను నష్టాలు ఇంకా వొదల్లేదు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం తరవాత కూడా టెక్ షేర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. దీనికి తోటు ఐటీ షేర్లలో కూడా ఒత్తిడి తగ్గడం లేదు. దీంతో నాస్డాక్ ఒకశాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ మాత్రం 0.44 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్ మాత్రం దాదాపు క్రితం ముగింపు వద్ద ఉంది. ఏ క్షణమైనా లాభాల్లోకి వచ్చేలా ఉంది. డాలర్ ఇవాళ కూడా అర శాతం పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ 111ని తాకింది. ఇదే సమయంలో క్రూడ్ ఆయిల్ కూడా స్వల్పంగా పెరిగింది. బ్రెంట్ క్రూడ్ మళ్లీ 90 డాలర్లను దాటింది. బులియన్‌కు దిగువస్థాయిలో స్వల్ప మద్దతు లభిస్తోంది. అయినా బంగారం ఇంకా 1680 డాలర్లే వద్దే ఉంది.