ఐటీ షేర్లకు డాలర్ దెబ్బ
ఇవాళ వాల్‌స్ట్రీట్ మిశ్రమ ధోరణి కన్పిస్తోంది. నిన్న ఒక మోస్తరుగా నష్టపోయిన డౌజోన్స్ ఇవాళ గ్రీన్‌లో ఉంది. డాలర్ ఇవాళ దాదాపు ఒక శాతంపైగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 112.75ను దాటింది. బాండ్ ఈల్డ్స్ కూడా 2 శాతం పైగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నిన్న 3.4 శాతం క్షీణించిన నాస్డాక్ ఇవాళ కూడా మరో ఒక శాతం నష్టపోయింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.62 శాతం నష్టపోయింది. ఇక క్రూడ్ స్వల్పంగా క్షీణించింది. డాలర్ పెరిగినా.. క్రూడ్‌లో ఆ స్థాయి పతనం రాలేదు. ఇక బులియన్ మార్కెట్ కూడా డల్‌గా ఉంది. బంగారం ఇపుడు కీలక మద్దతు స్థాయి 1629 వద్ద ట్రేడవుతోంది. ఈ స్థాయి కోల్పోతే మాత్రం 1580 డాలర్ల దాకా వెళ్ళే అవకాశముంది.