నాస్‌డాక్‌కు మెటా దెబ్బ
ఫేస్బుక్ (మెటా) షేర్ ఇవాళ నాస్‌డాక్‌కు గట్టి ఝలక్ ఇచ్చింది. కంపెనీ భవిష్యత్ అంచనాలను తగ్గించడంతో ఓపెనింగ్‌లోనే ఈ షేర్ 26 శాతం క్షీణించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో గడచిన 20 నెలలో తొలిసారిగా యాక్టివ్ యూజర్స్ తగ్గడంతో కంపెనీ షేర్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. యాపిల్ ప్రైవసీ పాలసీ మార్చడం కూడా మెటాకు గట్టి దెబ్బ తగిలింది.నిన్న 20 శాతం తగ్గిన పేపాల్ ఇవాళ మరో 4 శాతం దాకా తగ్గింది. ఇక స్నాప్‌చాట్ మాతృ సంస్థ షేర్ కూడా 20 శాతం క్షీణించగా, స్పోటిఫై షేర్ 18 శాతం క్షీణించింది. దీంతో నాస్డాక్ 2.45 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.55 శాతం క్షీణించగా, డౌ జోన్స్ 0.75 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ డాలర్ భారీగా క్షీణించింది. తాజా సమాచారం మేరకు 0.63 శాతం నష్టంతో డాలర్ ఇండెక్స్ 65.32 వద్ద ట్రేడవుతోంది. దీంతో క్రూడ్ ఆయిల్ ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ 90 డాలర్లు దాటేందుకు సిద్ధంగా ఉంది. డాలర్‌తో పాటు ఇవాళ బులియన్ కూడా క్షీణించడం విశేషం.