అమెజాన్ దెబ్బకు నాస్‌డాక్ డౌన్
అమెజాన్ వాల్‌స్ట్రీట్‌ను నిరాశపర్చింది. కంపెనీ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో పాటు, మున్ముందు కూడా గడ్డు స్థితి ఉంటుందని చెప్పడంతో ఈ కంపెనీ షేర్ 12శాతం నష్టపోయింది. మరోవైపు యాపిల్ కంపెనీ ఫలితాలు కూడా గొప్పగా లేవు. ఐఫోన్, మ్యాక్‌ల వ్యాపారం బాగున్నా, ఐప్యాడ్ అమ్మకాలు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 9 శాతం మాత్రమే పెరగడంతో షేర్ ధరలో పెద్ద మార్పు లేదు. స్వల్ప నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో నాస్‌డాక్ 2 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.9శాతం నష్టపోయింది. ఇక డౌజోన్స్ కూడా 1.4 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక కరెన్సీ మార్కెట్‌లో స్వల్ప ఒత్తిడి వచ్చినా డాలర్ ఇండెక్స్ 103పైనే ట్రేడవుతోంది.