For Money

Business News

టాటా మోటార్స్‌: ప్యూర్‌ EV అవిన్య

పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ వాహనం ‘అవిన్య’ ను 2025లో మార్కెట్‌లోకి తెస్తామని టాటా మోటార్స్‌ వెల్లడించింది. అవిన్య కాన్సెప్ట్‌ను ఇవాళ ఆ కంపెనీ మీడియాతో పంచుకుంది. టాటా మోటార్స్‌కు చెందిన టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటి (TPEM) డివిజన్‌ ఈ కారును అభివృద్ధి చేస్తోంది. ఇది ప్యూర్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ అని టాటా మోటార్స్‌ పేర్కొంది. అవిన్య అంటే సంస్కృతంలో ఆవిష్కరణ (Innovation) అని కంపెనీ పేర్కొంది. అత్యాధునిక టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సిలతో ఈ కారును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. 30 నిమిషాలు రీచార్జి చేస్తే కారు 500 కి.మీ దూరం ప్రయాణిస్తుందని వెల్లడించింది.