డీప్‌సీక్ దెబ్బకు నాస్‌డాక్ ఢమాల్

చైనా ఏఐ యాప్ దీప్‌సీక్ వాల్‌స్ట్రీట్‌ను కుదిపేస్తోంది. డీప్‌సీక్ దెబ్బకు నాస్‌డాక్ కుప్పకూలింది. ఓపెనింగ్‌లో నాస్‌డాక్ 3 శాతంపైగా క్షీణించింది. ఇటీవల 153 డాలర్లు పలికిన ఎన్‌విడియా షేర్లు నిన్న రాత్రి 142.62 డాలర్లకు పడగా, ఇవాళ 12 శాతం క్షీణించి 125 డాలర్లకు పడిపోయింది. సెమి కండక్టర్లు తయారు చేసే పలు కంపెనీల షేర్లు 10 శాతం దాకా పడ్డాయి. ఏఐ రంగానికి చెందిన పలు టెక్ కంపెనీల షేర్లు కూడా నాలుగు నుంచి అయిదు శాతం క్షీణించాయి. మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ షేర్లు మూడు శాతం నుంచి నాలుగు శాతం క్షీణించాయి. అమెజాన్ కూడా మూడు శాతం దాకా తగ్గింది. టెక్ కంపెనీలకు కూడా ప్రాతినిధ్యం వహించే ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 1.7 శాతం నష్టంతో ఉంది. ఎకానమీ షేర్ల సూచీ 0.34 శాతం నష్టంతో ట్రేడవుతోంది. మనదేశానికి చెందిన పలు ఐటీ కంపెనీల ఏడీఆర్‌లు కూడా రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.