For Money

Business News

లాభాలతో ప్రారంభమైనా….?

ఇవాళ మన స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కానున్నాయి. తాజా సమాచారం మేరకు గిఫ్ట్‌ నిఫ్టి 140 పాయింట్లకుపైగా లాభంతో ఉంది. గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌ ఒక శాతం దాకా నష్టపోయింది. ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ మాత్రం 0.26 శాతం నష్టంతో ముగిసింది. అయితే ఉదయం నుంచి అమెరికా ప్యూచర్స్‌ గ్రీన్‌లో ఉన్నాయి. ప్రధాన సూచీలు అరశాతందాకా లాభాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాభాలతో ప్రారంభమౌతున్న నిఫ్టి… అధిక స్థాయిలో నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రపంచ చమురు మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 104 డాలర్లకు చేరువ అవుతుండటం. హర్మజ్‌ జలసంధిని ఇరాన్‌ గుప్పెట్లో నుంచి విడుదలకు పోలిసింగ్‌ కోసం వివిధ దేశాలకు ట్రంప్‌ చేసిన విజ్ఞప్తికి పెద్దగా రెస్పెన్స్‌ రావడం లేదు. యూరప్‌లోని ప్రధాన దేశాలు నో చెప్పాయి. దీంతో మార్కెట్‌లో చమురు ధరలు తగ్గడం లేదు. ఇదే ట్రెండ్ కొనసాగితే… అధిక స్థాయిలో నిఫ్టి నిలబడటం కష్టమని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ నిలబడితే మాత్రం భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చే అవకాశం ఉంది.