మళ్ళీ బేర్స్ వచ్చేశారు…
వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ బేర్స్ స్వైర విహారం చేస్తున్నారు. ఈసారి ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. మెటా ప్లాట్‌ఫామ్స్ పది శాతం, టెస్లా 6 శాతం, గూగుల్ 7 శాతం, యాపిల్ నాలుగు శాతం, అమెజాన్, ఏఎండీ, టెస్లా 6 శాతం చొప్పున నష్టపోయాయి. నాస్డాక్ 3.5 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.22 శాతం, డౌజోన్స్ సూచీ 1.26 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ ట్రెజరీ బాండ్స్‌పై రిటర్న్స్ కూడా 5 శాతం క్షీణించినా.. షేర్ మార్కెట్ ఈ స్థాయిలో పడటం విశేషం. డాలర్ కూడా ఇవాళ స్వల్పంగా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ కూడా అధికస్థాయిలో కొనసాగుతోంది. డాలర్, ఈక్విటీ, క్రిప్టో కరెన్సీల పతనంతో బులియన్‌కు కాస్త మద్దతు లభించింది.