100 శాతం సబ్స్క్రిప్షన్
ముత్తూట్ మైక్రోఫిన్ ఐపీఓలో రీటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ తొలి రోజే వంద శాతం సబ్స్క్రయిబ్ అయింది. ఇతర విభాగాలు కలుపుకుంటే మొత్తంమీద ఐపీఓ తొలిరోజు 82 శాతం సబ్స్క్రయిబ్ అయింది. ఎన్ఐఐలకు కేటాయించిన వాటాలో 60 శాతం సబ్స్క్రయిబ్ కాగా, సంస్థాగత ఇన్వెస్టర్ల కేటగిరిలో తొలిరోజు ఎలాంటి బిడ్స్ దాఖలు కాలేదు. ఈ ఐపీఓలో షేరు ధరల శ్రేణిని రూ.277-291గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్ 20న ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగుస్తుంది. మొత్తం రూ.960 కోట్లను ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో రూ.760 కోట్లను కొత్త షేర్ల విక్రయం ద్వారా కాగా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో ఇష్యూ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. రీటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 51 షేర్లకు (ఒక లాట్) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది.. అంటే కనీసం రూ.14,841 పెట్టుబడి పెట్టాలి.