లాభాల్లో వాల్‌స్ట్రీట్
వాల్‌స్ట్రీట్‌లో మూడు ప్రధాన సూచీలు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్ అండ్ పీ 500 సూచీతోపాటు నాస్‌డాక్ సూచీలు 0.45 శాతం లాభంతో ఉన్నాయి. మార్కెట్‌కు అధిక వడ్డీ రేట్ల భయం తొలగడంతో కాస్త అనిశ్చితి తొలగింది. ఇపుడు మార్కెట్ చూపు కార్పొరేట్ ఫలితాలపై పడింది. రేపు యాక్సెంచుర్ ఫలితాలు రానున్నాయి. కంపెనీ గైడెన్స్‌ను పెంచే పక్షంలో నాస్‌డాక్ పరుగులు పెట్టే అవకాశముంది. భారత్ వంటి వర్థమాన మార్కెట్లకు బూస్ట్ రానుంది. మరోవైపు ఆరంభంలో డల్‌గా ఉన్న డాలర్ ఇపుడు స్థిరంగా ఉంది. అలాగే క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతవారం ఒకదశలో 72 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్ ధర ఇపుడు 78 డాలర్ల ప్రాంతంలో ఉంది. అధిక స్థాయిలో బులియన్ మార్కెట్ కూడా కన్సాలిడేట్ అవుతున్నట్లు కన్పిస్తోంది.