For Money

Business News

కేజ్రివాల్‌కు మళ్ళీ ఈడీ సమన్లు

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు గురువారం అంటే ఈ నెల 21న హాజరు కావాలని ఈడీ పేర్కొంది. నవంబర్‌ 2న ఈడీ సమన్లు జారీ చేసినా… మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రివాల్‌ హాజరు కాలేదు. మరోవైపు ఇదే కేసులో మరో కీలక ముద్దాయి అయిన అరుణ్‌ పిళ్ళైకు ఢిల్లీ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన అప్రూవర్‌గా మారినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితునిగా ఈడీ అరుణ్‌ పిళ్ళైని పేర్కొంటోంది.