ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లాభం ఓకే
డిసెంబర్ నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రూ. 340 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఇదే కాలంలో ఆర్జించిన రూ. 329 కోట్ల నికర లాభంతో పోలిస్తే 3 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం మాత్రం 21 శాతం జంప్‌చేసి రూ. 892 కోట్లకు చేరింది. కంపెనీ క్లయింట్ల సంఖ్య 6.2 లక్షలు పెరిగి 76 లక్షలకు చేరింది. వాటాదారులకు షేరుకి రూ. 12.75 చొప్పున తుది డివిడెండును చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో పూర్తి ఏడాదికి రికార్డు సృష్టిస్తూ రూ. 24 డివిడెండును అందించినట్లు తెలియజేసింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కంపెనీ నికర లాభం 29 శాతం ఎగసి రూ. 1,383 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 33 శాతం పెరిగి రూ. 3,438 కోట్లకు చేరింది.