For Money

Business News

ఉద్యోగాల కల్పనలో స్టాలిన్‌ రికార్డు

ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా దేశీయంగా నిరుద్యోగం నానాటికీ పెరుగుతోంది. అయితే తమిళనాడులో పరిస్థితి భిన్నంగా ఉంది. స్టాలిన్‌ అధికారంలోకి వచ్చిన తరవాత ఉద్యోగాల కల్పనపై ఆయన దృష్టి సారించారు. ప్రధానంగా ఆయన ఫార్మా సంబంధిత రంగాలకు తమిళనాడు కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ కారణంగా అనేక కంపెనీలు చెన్నై కేంద్రంగా పెట్టుడులు పెడుతున్నాయి. చెన్నైలోని గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ని మరింత విస్తరించాలని తాజాగా ఆస్ట్రాజెనెకా నిర్ణయిచింది. ప్రపంచంలో కంపెనీకి ఉన్న సెంటర్లలో ఇదే అతి పెద్దది కావడం విశేషం. జీసీసీకి తమిళనాడు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గడచిన మూడు ఏళ్ళలో తమిళనాడులో కేవలం జీసీసీ కేంద్రంగా 50,000 ఉద్యోగాలను సృష్టించగలిగింది. ఏకంగా 40 కంపెనీలు గత మూడేళ్ళలో తమిళనాడులో కొత్తగా సెంటర్లను ప్రారంభించడం లేదా ఉన్నవాటిని విస్తరించడం ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఫైజర్‌, రోషే, వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌, స్టాండర్డ్‌ చార్టెడ్‌, హిటాచి ఎనర్జి,రేనాల్ట్‌ నిసాన్‌, క్యాటర్‌ పిల్లర్‌, నొకియా, ఫోర్డ్‌ వంటి కంపెనీలు తమిళనాడులో తమ కార్యకలాపాలను పెంచాయి. స్టాలిన్‌ అధికారికంలోకి వచ్చిన తరవాత తమిళనాడుకు వచ్చిన బహుళ జాతి కంపెనీల్లో ఆదిదాస్‌, జిహుహో, యూపీఎస్‌, హార్మన్‌, హిటాచి ఎనర్జి, డెలాయిట్‌, జూమ్‌ ఇన్ఫో వంటి కంపెనీలు ఉన్నాయి.