For Money

Business News

కొత్త కేబినెట్‌ ఇదేనా?

మూడోసారి మోడీ ప్రభుత్వం ఇవాళ కొలువుతీరనుంది. ఇవాళ సాయంత్రం 7.15 నుంచి 8.00 వరకు దాదాపు 45 నిమిషాలపాటు ప్రధాని మోడీ కొత్త కేబినెట్‌ ప్రమాణ స్వీకరించనుంది. ప్రధానితోపాటు కొందరు కీలక మంత్రులు మాత్రం ప్రమాణం చేసే అవకాశం ఉంది.ఈ సారి మొత్తం 78 మందికి పదవులు దక్కవచ్చని వివిధ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నారు. చాలా మంది సీనియర్లను కొనసాగించడంతో పాటు కొత్తగా పలువురుని మోడీ తీసుకోనున్నారు. హోం, రక్షణ, ఆర్థిక, విదేశాంగశాఖ వంటి కీలక శాఖలను బీజేపీ వద్దు ఉంటాయి. నితిన్‌ గడ్కరీ, జైశంకర్‌, పీయూష్‌ గోయల్‌, కిషన్‌ రెడ్డి, రాందాస్‌ అథవాలే, ధర్మేంద్ర ప్రధాన్‌, నిర్మలా సీతారామన్‌ను కూడా కొత్త మంత్రివర్గంలో చోటు లభించనుంది. ఇక మిత్రపక్షాల నుంచి చిరాగ్‌ పాశ్వాన్‌, హెచ్‌డీ కుమారస్వామి, అనుప్రియా పటేల్‌, జయంత్‌ చౌధరీ, జతిన్‌ రామ్‌ మంఝీ, సోనోవాల్‌, కిరణ్‌ రిజిజు, రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌కు స్థానం లభించవచ్చు.

కేబినెట్‌లో వీరికి ఛాన్స్‌
1. అమిత్ షా
2. మన్‌సుఖ్ మాండవియా
3. అశ్విని వైష్ణవ్
4. నిర్మలా సీతారామన్
5. పీయూష్ గోయల్
6. జితేంద్ర సింగ్
7. శివరాజ్ సింగ్ చౌహాన్
8. హర్దీప్ సింగ్ పూరి
9.HD కుమారస్వామి
10. చిరాగ్ పాశ్వాన్
11. నితిన్ గడ్కరీ
12. రాజ్‌నాథ్ సింగ్
13. జ్యోతిరాదిత్య సింధియా
14. కిరెన్ రిజిజు
15. గిరిరాజ్ సింగ్
16. జయంత్ చౌదరి
17. అన్నామలై
18. ML ఖట్టర్
19. సురేష్ గోపి
20. జితన్ రామ్ మాంఝీ
21. రామ్‌నాథ్ ఠాకూర్ (మోస్)
22. జి కిషన్ రెడ్డి
23. బండి సంజయ్
24. అర్జున్ రామ్ మేఘ్వాల్
25. ప్రహ్లాద్ జోషి
26. చంద్రశేఖర్ చౌదరి
27. చంద్రశేఖర్ పెమ్మసాని
28. రామ్మోహన్‌ నాయుడు
29. రవ్‌నీత్ సింగ్ బిట్టు
30. జితిన్ ప్రసాద్
31. పంకజ్ చౌదరి
32. బీఎల్‌ వర్మ
33. లాలన్ సింగ్
34. సోనోవాల్
35. అనుప్రియా పటేల్
36. ప్రతాప్ రావ్ జాదవ్
37. అన్నపూర్ణా దేవి
38. రక్షా ఖడ్సే
39. శోభా కరంద్లాజే
40. కమల్జీత్ సెహ్రావత్
41. రావు ఇంద్రజీత్ సింగ్
42. రామ్ దాస్ అథవాలే
43. హర్ష్ మల్హోత్రా

44.భూపతి రాజు శ్రీనివాస వర్మ1