దుమ్ము రేపిన మిడ్ క్యాప్ నిఫ్టి
ఉదయం ఊహించినట్లే యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో ఉదయం నుంచి ఒక మోస్తరు పరిధిలోనే ఉన్న నిఫ్టి మిడ్ సెషన్ తరవాత ఊపందుకుంది. 17850ని దాటిన నిఫ్టి ఇపుడు ఒక శాతం లాభంతో 17828 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఉదయం నుంచి అవే షేర్లు గెయినర్స్‌గా ఉంటున్నాయి. ఇవాళ అసలు ట్రేడింగ్ మిడ్ క్యాప్ షేర్లలో జరుగుతోంది. మిడ్ సెషన్ సమయానికి మిడ్ క్యాప్ నిఫ్టి 2.5 శాతం దాకా పెరిగిందంటే… ఆ షేర్లలో ఉన్న జోష్ ఊహించొచ్చు. టైటాన్ పది శాతం దాకా లాభపడగా, టాటా మోటార్స్ 11 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇక మిడ్ క్యాప్ పేజ్ ఇండస్ట్రీస్ ఇవాళ అనూహ్యంగా టాప్ గెయినర్‌గా నిలిచింది. గత కొన్ని రోజులుగా భ ఆరీగా పెరుగుతున్న గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్ 8 శాతంపైగా లాభపడటం విశేషం.