మిడ్ క్యాప్‌లో అమ్మకాల హోరు
నిన్నటిదాకా అమ్మకాలు కేవలం నిఫ్టికే పరిమితమయ్యాయి. నిఫ్టి భారీగా క్షీణించినా నిఫ్టి నెక్ట్స్, మిడ్ క్యాప్ సూచీల్లో పతనం అంతంత మాత్రమే ఉండేది. కాని ఇవాళ మిడ్ క్యాప్‌తోపాటు నిఫ్టి నెక్ట్స్ భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి నెక్ట్స్ 1.66 శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్ నిఫ్టి 2.5 శాతం క్షీణించింది. నిఫ్టి నెక్ట్స్‌లో హావెల్స్ 4.98 శాతం, నౌకరీ డాట్ కామ్
4.83 శాతం, హెచ్‌పీసీఎల్ 4.38 డిమార్ట్ 3.98శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా -3.77 శాతం చొప్పున క్షీణించాయి.ఇక మిడ్ క్యాప్ నిఫ్టిలో LTTS 6.24 శాతం, జీ ఎంటర్‌టైన్మెంట్ 5.53 శాతం, కాన్‌కర్, 5.44శాతం, కెనరా బ్యాంక్ 5.08 శాతం, వోల్టాస్ 4.81 శాతం నష్టంతో ముగిశాయి.