నిఫ్టి@16500… మిడ్ క్యాప్ డౌన్
గత కొన్ని రోజులుగా జరుగుతున్నదే. ఎంపిక షేర్లను పెంచడం.. దరిమిలా నిఫ్టిని పెంచడం…కాని లోపాయికారీగా అనేక షేర్ల అమ్మకాలు సాగుతున్నాయి. సూచీలు పెరుగుతున్నాయని… రీటైల్ ఇన్వెస్టర్లు షేర్లను కొంటున్నారు. కాని వాస్తవానికి విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్ముకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు.. ముఖ్యంగా చైనా భారీ నష్టాల్లో ఉండగా మన మార్కెట్లు దాదాపు 0.75 శాతం పెరగడం విశేషం. మెటల్, ఐటీ షేర్లు పెరిగాయి. బ్యాంక్ షేర్లు కూడా ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతున్నాయి. అయితే మిడ్ క్యాప్ షేర్లలో అమ్మకాలు కొనసాగడం విశేషం. చాలా మంది ఇన్వెస్టర్లు ఈ రంగానికి చెందిన షేర్లను కొంటుంటారు. నిఫ్టిలో 33 షేర్లు గ్రీన్‌లో ఉండగా, 17 షేర్లు రెడ్‌లో ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం 124 పాయింట్ల లాభంతో 16488 వద్ద ట్రేడవుతోంది. ఓపెనింగ్ స్థాయి నుంచి నిఫ్టి వంద పాయింట్లకు పైగా పెరగడం విశేషం.