సూచీలు పైకి… షేర్లు దిగువకు
పూర్తిగా నిఫ్టిని పెంచే ప్రయత్నంలో ఉన్నారు ట్రేడర్లు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో దాదాపు 93 శాతంపైగా ట్రేడింగ్ కేవలం ఆప్షన్స్లోనే జరుగుతోంది. చాలా వరకు ఇన్వెస్టర్లు నిఫ్టి కదలికలపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో ట్రేడింగ్ మొత్తం నిఫ్టి ప్రధాన షేర్లకే పరిమితమౌతోంది. నిఫ్టిలో ఇవాళ 30 షేర్లు లాభపడగా, 20 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఫార్మా మినహా మిగిలిన సూచీలన్నీ గ్రీన్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టి కూడా అర శాతంపైనే పెరిగింది. అయితే రీటైల్తో పాటు విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల బాగా కొనుగోలు చేసిన మిడ్ క్యాప్ షేర్ల సూచీ మాత్రం అరశాంపైగా నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్ 50 సూచీ కూడా నామ మాత్రంగా గ్రీన్లో ముగిసింది. ఉదయం 16,376 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత లాభాల్లోనే కొనసాగుతూ వచ్చింది. ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు. ఒకదశలో 16,543ని తాకిన నిఫ్టి క్లోజింగ్లో 164 పాయింట్ల లాభంతో 16,529 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ షేర్ల సూచీ ఒక శాతంపైగా లాభపడింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
టాటా కన్జూమర్ 805.25 4.00
టీసీఎస్ 3,456.05 3.11
ఎల్ అండ్ టీ 1,665.05 2.56
హెచ్సీఎల్ టెక్ 1,123.95 2.50
టాటా స్టీల్ 1,467.25 2.22
నిఫ్టి టాప్ లూజర్స్
ఐషర్ మోటార్స్ 2,545.00 -2.73
డాక్టర్ రెడ్డీస్ 4,642.55 -1.57
పవర్ గ్రిడ్ 184.65 -1.26
సిప్లా 894.40 -1.20
బ్రిటానియా 3,581.00 -1.10