For Money

Business News

1000 మంది ఉద్యోగుల తొలగింపు

కరోనా సమయంలో భారీగా ఉద్యోగులను చేర్చుకోగా…. ఇపుడు వొదిలించుకునే పనిలో ఉన్నాయి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు. ఇప్పటికే రెండు విడతలు ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్‌ తాజాగా మరో 1000 మందిని తొలగించినట్లు అమెరికా న్యూస్‌ వెబ్‌ సైట్‌ Axios తెలిపింది. కంపెనీలో మొత్తం 1,80,000 మంది ఉద్యోగులు ఉండగా, 1,800 మంది ఉద్యోగులను జులైలో తొలగించింది. తరవాత కొంత మందిని తొలగించగా. తాజాగా 1000 మందిపై వేటు పడినట్లు తెలుస్తోంది. గత జులై నుంచి అమెరికాలో మైక్రోసాఫ్ట్‌, మెటా వంటి పెద్ద బ్లూచిప్‌ ఐటీ కంపెనీలు 32000 మంది ఉద్యోగులను తొలగించినట్లు క్రంచ్‌ బేస్‌ సంస్థ వెల్లడించింది.