ఎంజీఎఫ్‌కు రూ.450 కోట్ల టోపీ
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఎంజీఎఫ్ డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ ఇవాళ ఎనిమిది కంపెనీలపై కేసు పెట్టింది. (ఎమ్మార్ స్కామ్‌లో భాగస్వామ్య సంస్థ)గురుగ్రామ్ సమీపంలో 31 ఎకరాలకు సంబంధించిన వివాదంపై ఎంజీఎఫ్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో ఎనిమిది కంపెనీల పేర్లను పేర్కొంది. సెక్టార్ 112, సెక్టార్ 113లో ఉన్న 31.0625 ఎకరాల భూమిని తప్పుడు పద్ధతుల్లో తమ పేరుపై ఈ ఎనిమిది కంపెనీలు మార్చుకున్నాయని ఎంజీఎఫ్ పేర్కొంది. ఈ భూమి విలువ రూ. 450 కోట్లకుపైనే ఉంటుందని పిటీషన్‌లో పేర్కొంది. కంపెనీ ఈనెల 17న ఫిర్యాదు చేయగా ఇవాళ ఢిల్లీ పోలీసులకు చెందిన ఆర్థిక నేరాల విభాగం (EoW) కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో పేర్కొన్న కంపెనీలు: ఎం3ఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,
నౌరిష్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టార్‌సిటీ రియల్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, కాస్మో ప్రోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ప్రాప్‌కార్న్ ప్రైవేట్ లిమిటెడ్, నీర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైబ్రాంట్ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, పంఖ్ రియల్‌కాన్ ప్రైవేట్ లిమిటెడ్.