For Money

Business News

మెట్రో బ్రాండ్స్ చేతికి క్రావాటెక్స్‌

ఫిలా, ప్రొలిన్‌ వంటి ప్రముఖ ఇటాలియన్‌ బ్రాండ్స్‌తో దీర్ఘకాలిక ఒప్పందం ఉన్న క్రావాటెక్స్‌ బ్రాండ్స్‌లో వంద శాతం ఈక్విటీని మెట్రో బ్రాండ్స్‌ కొనుగోలు చేసింది. కావాటెక్స్‌లో పారాగాన్‌ పార్ట్‌నర్స్‌కు వాటా ఉంది. ఈ వాటాను కూడా మెట్రో బ్రాండ్స్‌కు పారాగాన్‌ అమ్మేయనుంది. వివిధ రకాల లగ్జరీ బ్రాండ్‌ ఫుట్‌వేర్‌ను అమ్ముతున్న మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ నిన్న 3.55 శాతం నష్టంతో రూ. 898 వద్ద ముగిసింది. మరోవైపు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 488 కోట్ల టర్నోవర్‌పై రూ. 76 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ పనితీరు బాగున్నా… జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ టర్నోవర్‌ 6 శాతం, నికర లాభం 27 శాతం క్షీణించింది.