For Money

Business News

రూ.350 కోట్లతో మెడ్‌ ప్లస్‌ విస్తరణ

మెడ్‌ప్లస్‌ రిటైల్‌ ఔషధ స్టోర్లను మరింతగా విస్తరించాలని మెడ్‌ప్లస్‌ హెల్త్‌ సర్వీసెస్‌ నిర్ణయించింది. ఈ కంపెనీ ఇటీవలే క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించిన విషయం తెలిసిందే. 2021-22 ముగిసేనాటికి తమ కంపెనీకి 2,750 స్టోర్లు ఉన్నాయని.. వీటిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 4,000కు పెంచనున్నామని మెడ్‌ప్లస్‌ సీఈఓ మధుకర్‌ గంగాడి తెలిపారు. టీ-హబ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ విస్తరణకు రూ.300-350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఇటీవల పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించిన నిధులను ఈ విస్తరణకు వినియోగించనున్నట్లు చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లో ఒక్కొక్కటి రూ.12-13 కోట్లతో రెండు పెద్ద డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను మెడ్‌ప్లస్‌ ఏర్పాటు చేసింది. వీటితో పాటు కూకట్‌పల్లి, కొంపల్లిలో రెండు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు