3న గ్లోబల్ హెల్త్ ఐపీఓ
దేశంలోనే అత్యుత్తమ హాస్పిటల్స్‌లో ఒకటైన మేదాంత హాస్పిటల్ పబ్లిక్ ఆఫర్‌కు రానుంది. ఈ హాస్పిటల్ మాతృసంస్థ గ్లోబల్ హెల్త్ లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) వచ్చేనెల 3న ప్రారంభమై 7న ముగియనుంది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.2,200 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రస్తుత ప్రమోటర్లు, వాటాదారులకు చెందిన 5.08 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. పబ్లిక్ ఆఫర్ ద్వారా సమీకరించిన సొమ్ములో అధిక భాగం రుణాలు తిరిగి చెల్లించేందుకు ఉపయోగిస్తారు. రూ. 2 ముఖ విలువ గల షేర్లను ఆఫర్ చేస్తారు. ధరల శ్రేణి ఇంకా ఖరారు కాలేదు. ఈ షేర్లు నవంబర్ 16న లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు.