మళ్లీ ఆల్టో కే10!
కరోనా తరవాత మధ్య తరగతి ముఖ్యంగా దిగువ మధ్య తరగతి ఆర్థికంగా చితికిపోయింది. బైక్ నుంచి కారుకు మారాలనుకునేవారి సంఖ్య భారీగా తగ్గుతోంది. లగ్జరీ కార్లకు భారీ డిమాండ్ ఉన్న మిడ్‌సైజ్ కార్లకు డిమాండ్ అంతంత మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో దిగుమతి మధ్య తరగతి చిన్న కార్లపై ఆసక్తి చూపుతున్నట్లు మారుతీ గుర్తించింది. అందుకే రెండేళ్ళ క్రితం ఉత్పత్తి ఆపేస్తున్నట్లు ప్రకటించిన ఆల్టో కే10 కారును మళ్లీ మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తోంది. హ్యాచ్‌బ్యాక్ ఎంట్రీ లెవెల్ కార్లలో పోటీ కూడా అంతంత మాత్రమే ఉండటంతో ఆల్టో కే10కు డిమాండ్ పెరుగుతోంది. బైక్ నుంచి కారు సెగ్మెంట్లోకి రావాలనుకున్నవారు .. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో చిన్నకార్లవైపు మొగ్గుచూపుతున్నారు. ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో మారుతి ఎస్ప్రెస్సో, రెనాల్డ్‌కు చెందిన క్విడ్ మోడల్ కార్లు మాత్రమే మార్కెట్లో ఉన్నాయి. భారత్ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడైన ఎంట్రీ లెవెల్ కారుగా ఆల్టో కె10 నిలిచింది.