మారుతీ లాభంలో 66% డౌన్
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 66 శాతం క్షీణించి రూ.487 కోట్లకు చేరింది. లాభం భారీగా తగ్గడానికి కారణం ముడిపదార్థాల ధరలు పెరగడంతో పాటు చిప్‌ల కొరత అని కంపెనీ పేర్కొంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,420 కోట్లు. కంపెనీ టర్నోవర్ మాత్రం రూ.18,756 కోట్లు నుంచి రూ.20,551 కోట్లకు చేరింది.
ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అమ్మకాలు 3,79,541 యూనిట్లని పేర్కొంది. గక్రితం ఏడాది వాహనాల అమ్మకాలు 3,93,130 యూనిట్లతో పోలిస్తే మూడు శాతం తక్కువ అని కంపెనీ పేర్కొంది. ఈ త్రైమాసికంలో మొత్తం 1.16 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నా…. చిప్‌ల కొరత వల్ల సాధ్యం కాలేదని సంస్థ పేర్కొంది. స్టీల్, అల్యూమినియం సహా ఇతర కీలక లోహాల ధరలు భారీగా పెరిగాయని కూడా కంపెనీ వెల్లడించింది.