ఈవారం మార్కెట్లు మూడు రోజులే
దేశంలో వచ్చేవారం స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ, కమాడిటీ మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేస్తాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే పనిచేస్తాయి. ప్రతి గురువారం డెరివేటివ్స్ వీక్లీ సెటిల్మెంట్ గురువారం జరుగుతుంది. అయితే ఈ వారం సెటిల్మెంట్ బుధవారం జరుగుతుంది. గురువారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి/మహావీర్ జయంతి/బైశాఖి/తమిళ కొత్త ఏడాది/భోగ్ బీహూ సందర్బంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. అలాగే శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు. అంబేద్కర్ జయంతి రోజున కమాడిటీ మార్కెట్స్ ఉదయం సెషన్ సెలవు. సాయంత్రం నుంచి రాత్రి వరకు పనిచేస్తాయి. శుక్రవారం మాత్రం కమాడిటీ మార్కెట్లకు పూర్తి సెలవు.మళ్లీ మార్కెట్ తెరిచేది సోమవారమే.