For Money

Business News

ఐటీసీపై మీమ్స్‌ వరద

గత రెండేళ్ళ నుంచి ఐటీసీ ఇన్వెస్టర్లను చూసి.. అందరూ జాలి పడేవారే. ముఖ్యంగా న్యూఏజ్‌ షేర్లు కొన్నవారు, అదానీ ఇన్వెస్టర్లు… చివరికి రుచి సోయా ఇన్వెస్టర్లు కూడా ఐటీసీ ఇన్వెస్టర్లను చూసి నవ్వుకునే పరిస్థితి. కారణాలు ఏమైతేనేం… రెండేళ్ళ నుంచి అన్ని షేర్లను కొత్త రికార్డులు సృష్టిస్తుంటే ఐటీసీ మాత్రం రూ. 200 ప్రాంతంలోనే కొట్టుమిట్టాడుతోంది. ముఖ్యంగా గత ఏడాది సిగరెట్లపై పన్నువేయడం, కరోనా కారణంగా హోటల్స్‌ మూతపడటం, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారం అంతంత మాత్రమేం ఉండటం.. కాగితం యూనిట్‌ కూడా ఒక మోస్తరుగా ఉండటంతో ….షేర్‌ ధరలో పెరుగుదల రాలేదు. అయితే గత డిసెంబర్‌లో ప్రధాన షేర్లలో ర్యాలీ అయిపోయింది. సూచీలు ఏమోగాని.. చాలా షేర్లు 30 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గాయి. సరిగ్గా ఇదే సమయంలో ఐటీసీ కదలడం ప్రారంభమైంది. కాని రూ. 235 వచ్చినపుడల్లా లాభాల స్వీకరణ. మొత్తానికి నిన్న ఐటీసీ షేర్‌ 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటింది. అంతే ఐటీసీ ఇన్వెస్టర్ల ఆనందానికి అవధుల్లేవ్‌… ఇంకేముంది… సోషల్‌ మీడియాలో ఐటీసీ షేర్‌ జైత్రయాత్రపై ఒకటే మీమ్స్‌…