స్థిరంగా నిఫ్టి
నిఫ్టి 18700 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఓపెనింగ్‌లోనే 18728ని తాకిన నిఫ్టి… వెంటనే 18661ని కూడా తాకింది. ఇపుడు 18682 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 14 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇతర సూచీలు కూడా స్వల్ప లాభ, నష్టాల్లో ఉన్నాయి. సూచీలు స్థిరంగా ఉన్నా… షేర్లు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఐటీ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ముఖ్యంగా చైనాలో కరోనా సంక్షోభం తగ్గుముఖం పట్టిందన్న వార్తలతో చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. చైనా వార్తలతో మెటల్ షేర్లకు గట్టి మద్దతు లభించింది. అలాగే క్రూడ్ ధరలు పెరిగాయి. మార్కెట్ ఇవాళ ద్వితీయార్ధంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ దృష్ట్యా హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది.