For Money

Business News

LEVELS: నో ట్రేడ్‌ జోన్‌

నిఫ్టి ఇవాళ 50 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇదే జరిగితే నిఫ్టికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. నిఫ్టి గనుక పడితే బై ఆన్‌ డిప్స్‌ పద్ధతిలో కొనుగోలు చేయొచ్చని అన్నారు. నిఫ్టి 18600 ప్రాంతానికి వస్తే కొనుగోలు చేయొచ్చని 18550 స్టాప్‌లాస్‌తో ట్రేడ్‌ చేయొచ్చని అంటున్నారు. నిఫ్టి గనుక 18762 వద్ద తొలి ప్రతిఘటన ఉంది. తరవాతి ప్రతిఘటన 18/781. అయితే మిడ్‌ సెషన్‌ సమయంలో స్వల్పంగా తగ్గుతుందేమో చూడాలి. నిఫ్టి గనుక పడితే … చివర్లో మద్దతు అందవచ్చు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ రాత్రికి రానున్నాయి. బీజేపీ గెలుస్తుందని భావించే ఇన్వెస్టర్లు నిఫ్టిలో లాంగ్‌ పొజిషన్‌ తీసుకునే అవకాశముంది. అదే బీజేపీ ఓటమి పాలవుతుందని భావిస్తే.. కాల్‌ రైటింగ్‌కు పాల్పడవచ్చు.లేదా పుట్స్‌ కొనుగోలు చేయొచ్చు. నిఫ్టి పడితే కొనుగోలు చేయాలనుకునేవారు మరో హెడ్జ్‌ ట్రేడ్‌ చేసుకోవడం బెటర్‌. హెడ్జింగ్‌ లేకుండా ఏ పొజిషన్‌ కూడా కొనుగోలు చేయొద్దని అంటున్నారు.