For Money

Business News

NIFTY TRADE: ఓవర్‌ సోల్డ్‌ కాని…

మార్కెట్‌ ఓవర్ సోల్డ్‌లో ఉందని, RSI 30 ప్రాంతంలో ఉండటంతో… నిఫ్టికి మద్దతు లభించవచ్చని స్టాక్‌ మార్కెట్ డేటా అనలిస్ట్ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. అయితే విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల తరవాత.. ఇప్పటికిపుడు నిఫ్టి లెవల్స్‌ అంచనా వేయడం కష్టంగా ఉందని ఆయన అంటున్నారు. పుట్స్‌, కాల్స్‌ డేటా వస్తే కాని ఒక అంచనాకు రాలేమని, డేటా ఇపుడు చాలా గందరగోళంగా ఉందని.. స్పష్టమైన దిశ లేదని ఆయన అంటున్నారు. నిఫ్టి 16550 పైన పటిష్ఠంగా ముగిసి… ఆ తరవాత నిలదొక్కుకుంటేనే లాంగ్‌ పొజిషన్‌ గురించి మాట్లాడాలని… అప్పటి వరకు లాంగ్ పొజిషన్స్‌ వొద్దని ఆయన సలహా ఇస్తున్నారు. కొత్త సిరీస్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభమౌతోంది. కాబట్టి ఆయన ఎలాంటి సలహా ఇవ్వలేదు. మరిన్ని వివరాలకు వీడియో చూడండి.