అశ్వని గుజ్రాల్ మృతి
ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ ఇవాళ మృతి చెందారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్‌గా ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టి కదలికలను టెక్నికల్‌గా పసిగట్టడంలో అశ్వని సిద్ధహస్తుడు. ఆయన ప్రముఖ బిజినెస్ న్యూస్ ఛానల్స్ సీఎన్‌బీసీ టీవీ18, ఈటీ నౌలలో మార్కెట్ అనలిస్టులగా పాల్గొనేవారు. దశాబ్దాల పాటు ఆయన ఆయన సాధారణ ఇన్వెస్టర్లకు టెక్నకల్ అంశాలను బోధించారు. అలాగే చాలా మంది డే ట్రేడర్స్ ఆయన గురువు. డే ట్రేడింగ్‌లో సూచీలతో పాటు షేర్ల రెకమెండేషన్లు ఇవ్వడంలో ఆయనకు సక్సెస్ఫుల్ అనలిస్ట్‌గా మంచి పేరు ఉంది. ట్రేడింగ్ డెరివేటివ్స్ అండ్ చార్టింగ్ అంశంపై ఆయన రాసిన రెండు పుస్తకాలకు మంచి పేరు వచ్చింది. ఆ రెండు పుస్తకాలు : హౌ టు మేక్ మనీ ట్రేడింగ్ డెరివేటివ్స్, హౌ టు మేక్ మనీ ట్రేడింగ్ చార్ట్స్. అలాగే హౌ టు మేక్ మనీ ఇన్ ఇంట్రా డే ట్రేడింగ్ పుస్తకంలో… ఇంట్రా డే ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లకు ఉండాల్సిన నైపుణ్యం, పద్ధతులు, సామర్థ్యం వంటి అంశాలను వివరించారు.