For Money

Business News

17400 దిగువకు నిఫ్టి

ప్రపంచ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. అదే ట్రెండ్‌ మనదేశంలో కూడా కన్పిస్తోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక శాతంపైగా నష్టపోగా… ఇవాళ ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి కూడా ఆరంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంమైనా… వెంటనే వంద పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆరంభంలో 17451ని తాకిన నిఫ్టి 17358ని తాకిన తరవాత ఇపుడు 17383 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్లు నష్టంతో ఉంది. ఇవాళ బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు నిఫ్టిని తీవ్రంగా ప్రభావం చూపాయి. అదానీ గ్రూప్‌ షేర్లకు ఎలాంటి ఊరట కలభించలేదు. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 4 శాతం దాకా నష్టపోగా… నిఫ్టి నెక్ట్స్‌లోని మూడు ప్రధాన అదానీ షేర్లు ఇవాళ కూడా లోయర్‌ సీలింగ్‌లో ఉన్నాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌ షేర్లు 5 శాతం నష్టంతో ట్రేడువుతున్నాయి. బ్యాంక్‌ నిఫ్టి మినహా మిగిలిన సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.