For Money

Business News

17500 దిగువన నిఫ్టి

మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాల్లో ముగిసింది. అమెరికా, ఆసియా మార్కెట్ల ఊతంతో ఉదయం లాభాల్లో ఆరంభమైనా… 11 గంటలకే నష్టాల్లోకి జారుకుంది. తరవాత స్వల్పంగా పెరిగినా… నిలబడలేకపోయింది. మిడ్‌ సెషన్‌ తరవాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో నిఫ్టి 17421 స్థాయిని తాకింది. అంటే ఇవాళ గరిష్ఠ స్థాయి 17599 నుంచి 178 పాయింట్లు క్షీణించింది. చివరికి 17465 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 45 పాయింట్లు క్షీణించింది. అదానీ గ్రూప్‌ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 5 శాతంపైగా క్షీణించింది. అదానీ పోర్ట్స్‌ మాత్రం 1.44 శాతం పెరిగింది. అయితే అదానీ గ్రీన్‌, అదానీ టోటల్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు ఇవాళ కూడా 5 శాతం లోయర్‌ సీలింగ్‌లో ముగిశాయి. అంబుజా సిమెంట్‌ మాత్రం రెండు శాతం లాభంతో ముగిసింది. బ్యాంకు షేర్లు మిశ్రమంగా ముగిశాయి.