హైసియా అధ్యక్షురాలుగా మనీషా సాబు
ది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా)కు తొలిసారి మహిళ సారథ్యం వహించబోతున్నారు. ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్ సెంటర్ హెడ్ మనీషా సాబు హైసియా కొత్త ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆమె 2022-24 సంవత్సరానికిగాను అధ్యక్షురాలిగా ఉంటారు. ఇప్పటి వరకు ప్రెసిడెంట్గా పనిచేసిన భరణి కే అరోల్ స్థానంలో ఆమె నియమితులయ్యారు. ఐటీ రంగంలో 20 ఏళ్ళకు పైగా అనుభవం ఉన్న మనీషా..రాష్ట్రంలో ఐటీ రంగ మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారు. అలాగే హైసియా వైస్ ప్రెసిడెంట్గా ప్రశాంత్ నందెళ్ళ, జనరల్ సెక్రటరీగా రామకృష్ణ లింగిరెడ్డి, ట్రెజరీగా సంతను పాల్ ఎంపికయ్యారు.