మహేష్ బ్యాంక్ సర్వర్ హ్యాక్
మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12 కోట్లు కోట్లు కొట్టేశారు సైబర్ నేరగాళ్ళు. బ్యాంక్ మెయిన్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లను 100 వేర్వేరు బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశారు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు బ్యాంక్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏయే ఖాతాలకు నగదు బదిలీ అయిందో వాటి వివరాలు సేకరిస్తున్నారు.